

లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ‘సీఈఓ సీఎం టూ వాటర్‌మ్యాన్’ కథనాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ మంత్రి నిమ్మల రామానాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ఊతమిచ్చి యువతకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు కల్పించిన చంద్రబాబు.. అనంతరం సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించి ‘వాటర్‌మ్యాన్’గా గుర్తింపు పొందారని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం, వెలిగొండతో పాటు పలు ప్రాజెక్టులను చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాలకు నీటిని అందించే చర్యలు చేపట్టారని తెలిపారు. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతానికి, హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు నీటిని తరలించిన విషయాన్ని ఈటీ తన కథనంలో ప్రస్తావించిందని మంత్రి వివరించారు.
ఏపీలో సుమారు నాలుగు కోట్ల ఎకరాల భూమి ఉండగా, రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకురావాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే మార్గమని చంద్రబాబు విధానంగా పెట్టుకున్నారని ఈటీ పేర్కొందని నిమ్మల తెలిపారు. 2019 తర్వాత సాగునీటి రంగం దెబ్బతిన్నదని, మూడు దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో చంద్రబాబు కృషిని ఈటీ ప్రశంసించిందని చెప్పారు. ఉత్తరాంధ్రకు నీరందించేలా పోలవరం ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసి గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లడం, 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యం, వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ప్రణాళికలను కూడా కథనం ప్రశంసించిందన్నారు. భూగర్భ జలాల పెంపునకు ‘జలధార’ వంటి కార్యక్రమాలపై సీఎం దృష్టి సారించారని తెలిపారు. ఈ తీర్మానానికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!