

భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతున్నా స్టేడియాలు పూర్తిగా నిండడం కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు భారీగా అభిమానులు తరలిరావడం ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతున్న వేళ.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఐపీఎల్‌లో వరుసగా మెరుగైన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న వైభవ్.. కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు.
ఈ క్రమంలో లభించిన విరామంలో దులీప్ ట్రోఫీ ఆడుతున్న వైభవ్ ఆటను చూసేందుకు తొలి రోజు చెన్నై అభిమానులు పెద్ద సంఖ్యలో చెపాక్‌కు చేరుకున్నారు. ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. క్రీజులో ఉన్నంతసేపు వైభవ్ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. 37 బంతుల్లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యువ క్రికెటర్లకు లభిస్తున్న ఆదరణ దేశవాళీ క్రికెట్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచగలదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చాటింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!