
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి తెలంగాణ అసెంబ్లీకి చేరుకోవడంతో గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
తోపులాటలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి కాలికి గాయం అయినట్లు సమాచారం. మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని ఆరోపిస్తూ సునీతా లక్ష్మారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఘటనతో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!