
ఓటీటీ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను అధికార పీఠం నుంచి దించేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా “కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే” అనే నినాదం బలంగా వినిపిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, యూరియా కొరత, రైతుల సమస్యలు, అప్పుల భారమే మిగిల్చిందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో భారీ అభివృద్ధి జరిగిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. తాను “సాఫ్ట్‌వేర్ కాదు.. హార్డ్‌వేర్” అంటూ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!