8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Writer: Nithish 06:23 AM, 8 సెప్టెంబర్, 2026
మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను అధిగమించి మహిళలు ముందుకు రావాలని చెబుతుంటే.. తెలంగాణలో అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. ఆడబిడ్డల గొంతులు పట్టి, జుట్టు లాగడమే ప్రజాపాలనా? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదిస్తూ ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు, రాహుల్‌గాంధీ ఇలాంటి టీషర్టులు ధరించి నినాదాలు చేసిన సందర్భాల్లో వారిని ఎవరూ అడ్డుకోలేదని, లోక్‌సభ నిబంధనలే శాసనసభలోనూ వర్తిస్తాయని పేర్కొన్నారు. దళితులపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత సమావేశాల్లోనే దళిత డిక్లరేషన్‌పై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, ఫింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతు నొక్కారని ఆరోపించారు. పోలీసులను ప్రయోగించి భారాస ఎమ్మెల్యేలను మెడ పట్టి బయటకు గెంటేశారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించారని విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిని నిమ్స్‌కు తరలించారు. పోలీసులపై దాడి, దుర్భాషలాడారన్న ఆరోపణలపై కేటీఆర్‌, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డితోపాటు పలువురిపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, స్పీకర్‌ను కించపరిచే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను స్పీకర్‌ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. స్పీకర్‌, మండలి ఛైర్మన్‌పై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
కేటీఆర్‌తాతా మధుతెలంగాణ అసెంబ్లీభారాసరేవంత్‌రెడ్డిహరీశ్‌రావుమహిళా ఎమ్మెల్యేలుతెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ నిరసనలుసైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు