
రాజకీయాలు

భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు అంతరాయానికి గురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబయి, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్ నుంచి వచ్చే విమానాలు ప్రభావితమయ్యాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. దాంతో కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతిని నిరాకరించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!