
జనరల్

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు సభలో వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ఎంపీలు సభకు హాజరయ్యారు.
మొత్తం 19 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో కీలక అంశాలపై విస్తృత చర్చలు జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలు సందర్భాల్లో సభ కార్యకలాపాలు వాయిదాలతోనే కొనసాగాయి. చివరి రోజుతో లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంపై అధికార, విపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు చోటుచేసుకున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!