

విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నాన్-థియేట్రికల్ హక్కులపై దృష్టి పెట్టింది. విజయ్ సేతుపతికి తమిళంలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే విజయ్ సేతుపతి నటించిన ఇతర చిత్రాల విడుదల తేదీలు ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’కు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నటించిన ‘ట్రైన్’ సెప్టెంబర్‌కు వాయిదా పడగా, ‘బత్తా’ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో పూరీ జగన్నాథ్ చిత్రానికి సరైన రిలీజ్ డేట్ కేటాయించడం సవాల్‌గా మారింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఈ సినిమాలు విడుదలైతే ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!