
టెక్నాలజీ

మహారాష్ట్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు కేతన్ మృతి కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనపై లోనావాలా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేతన్ మృతిలో అతని నిశ్చితార్థ సఖి సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలతో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో కేతన్, సియా వివాహం జరగాల్సి ఉండగా, కుటుంబ సభ్యులు జైపూర్‌లో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో వివాహ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ కేసు వెనుక అసలు నిజాలు వెలికితీసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!