
బిజినెస్

భారత రక్షణ, విమానయాన రంగాల్లో మరో కీలక మైలురాయి నమోదైంది. దేశంలోనే తయారైన తొలి C-295 సైనిక రవాణా విమానం తన తొలి పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్‌లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం సురక్షితంగా ప్రయాణాన్ని ముగించి ల్యాండ్ అయింది. ఇది భారతదేశంలో తయారవుతున్న C-295 విమానాల్లో తొలి విమానం కావడం విశేషం.
ఎయిర్‌బస్ భాగస్వామ్యంతో భారత్‌లో నిర్మిస్తున్న మొత్తం 40 C-295 విమానాల్లో ఇదే మొదటిది. ఈ విజయవంతమైన తొలి విమాన ప్రయాణం భారత రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని సాధించిన బృందాన్ని భారత వైమానిక దళం (IAF) ప్రత్యేకంగా అభినందించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!