

తెలంగాణ వ్యాప్తంగా 2026 ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై టీపీసీసీ అత్యవసర జూమ్ సమీక్షా సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. కొనసాగుతున్న SIR ఫేజ్-II కార్యక్రమాల్లో భాగంగా అన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు, సమన్వయంపై చర్చించారు.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. DCC అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ SIR కోఆర్డినేటర్లు, మండల/టౌన్/డివిజన్ అధ్యక్షులు, BLA సూపర్‌వైజర్లు, BLAs సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలోని Anomalies, Unmapped వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని సూచించారు. గ్రామ, వార్డు సభలకు ముందు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, బూత్ స్థాయి బాధ్యతలు, పర్యవేక్షణ, నివేదికల విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!