
సినిమాలు

హరిద్వార్‌లోని ప్రసిద్ధ మాన్సా దేవి ఆలయం విరాళాలు, కానుకల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో సేవలందించే పూజారులందరికీ జేబులు లేని ప్రత్యేక కుర్తాలను తప్పనిసరి చేస్తూ ఆలయ ట్రస్ట్ కొత్త విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా విరాళాల నిర్వహణలో మరింత బాధ్యతాయుతమైన వ్యవస్థను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదే సమయంలో విరాళాల సేకరణ, నిర్వహణను పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులకు అధికారిక బాధ్యతలు అప్పగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చర్యలతో భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆలయ యాజమాన్యం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!