
జనరల్

భీమవరంలో ‘రక్షాదళ్’ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమంలో హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రితో కూడిన స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్, చదువే జీవితాన్ని మార్చే గొప్ప శక్తి అని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు మరియు గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు విద్యకు ప్రోత్సాహాన్ని అందించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!