
సినిమాలు

ఆన్లైన్లో చిన్నారుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాతో చర్చలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను చట్ట అమలు సంస్థలకు నివేదించేందుకు మెటా అంగీకరించింది. ఆన్లైన్లో చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటువంటి కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ముందుగానే గుర్తించి తొలగించాల్సిందేనని పేర్కొంది.
చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో విఫలమయ్యే ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని కల్పించడం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యత అని స్పష్టం చేస్తూ.. ఇలాంటి కేసులను సంబంధిత చట్ట అమలు సంస్థలకు వెంటనే నివేదించాలని కేంద్రం సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!