
జనరల్

నీట్ పేపర్ లీకేజీ వివాదం తర్వాత కేంద్రం నిర్వహించిన రీ-నీట్ 2026 ఫలితాలు విడుదలైనప్పటికీ విద్యార్థుల సమస్యలు కొనసాగుతున్నాయి. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా తాము ఆశించిన మార్కులకు, స్కోర్‌కార్డుల్లో నమోదైన మార్కులకు ఏమాత్రం పొంతన లేదని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మార్కుల్లో భారీ తేడాలు కనిపించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభా త్రివేది అనే విద్యార్థిని తనకు 720 మార్కులకు 638 మార్కులు వస్తాయని భావించగా, స్కోర్కార్డులో కేవలం 38 మార్కులు మాత్రమే వచ్చాయని తెలిపింది. తన ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించాలని కేంద్ర విద్యాశాఖ, ఎన్టీఏను కోరినా స్పందన రాలేదని పేర్కొంది. తనలాగే దాదాపు 600 మంది అభ్యర్థులు మార్కుల వ్యత్యాసంతో ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ, పలువురు విద్యార్థులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!