
జనరల్

‘ది పయనీర్’ పత్రిక వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పత్రికపై పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేయొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. ‘ది పయనీర్’పై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో భాగంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
కవితతో పాటు మరో 14 మంది జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైనా కోర్టు ఆంక్షలు విధించింది. కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ‘ది పయనీర్’పై మరిన్ని పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!