

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, వృద్ధులు, వితంతువులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛన్ వంటి హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు విద్యా భరోసా, రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, వివిధ వర్గాలకు సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల్లో అమలు చేసిన హామీలు, పెండింగ్‌లో ఉన్నవి, విరమించుకున్న హామీల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. హామీల అమలుకు బదులుగా ప్రచారాలు, ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శిస్తూ, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!