
క్రీడలు

బీజేపీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా ఆయనను నియమించింది. ఈ బాధ్యతల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణను సత్యకుమార్ యాదవ్ చేపట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనున్నాయి. పార్టీ శ్రేణులు, ప్రజల భాగస్వామ్యంతో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళిక రూపొందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!