

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు నిర్దోషిగా తేల్చిన సురేంద్ర కోలీ హరిద్వార్‌లో మృతి చెందాడు. శుక్రవారం ఓ టీ దుకాణంలో ఆయన మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా హరిద్వార్‌లో ఉంటున్న కోలీ ఇటీవల ఓ టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు తెలిపారు.
2006 డిసెంబరులో నోయిడాలోని నిఠారి ప్రాంతంలో మోనిందర్ సింగ్ పంఢేర్ ఇంటి వెనుక ఉన్న డ్రెయిన్‌లో అస్థికలు బయటపడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో పంఢేర్‌తో పాటు కోలీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిఠారి కేసులకు సంబంధించిన 12 కేసుల్లో కోలీని అలహాబాద్ హైకోర్టు 2023లో నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు 2025 జులైలో సమర్థించింది. అనంతరం అదే ఏడాది నవంబర్‌లో చివరి కేసులోనూ కోలీపై ఉన్న శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసి నిర్దోషిగా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!