
క్రీడలు

బ్యాంకాక్ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. పిస్టల్‌తో స్కూల్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరపడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే స్కూల్ విద్యార్థి అయ్యి ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాంతంలోని పాఠశాలల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!