
సినిమాలు

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. “సేన ప్రస్థానం… జాతీయ సమైక్యత కోసం” అనే శీర్షికతో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రాంతీయతను గౌరవిస్తూ జాతీయ సమగ్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి.
జనసేన స్థాపనకు 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, జాతీయ సమైక్యత దిశగా చేసిన ప్రయాణం ఈ సమావేశంలో వివరించనున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కొత్తగా చేరిన నేతలు కూడా హాజరవుతున్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!