

నీట్, జేఈఈ లేదా ఇతర ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ఫలితం రాకపోవడం నిరాశ కలిగించవచ్చు. అయితే ఒక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన లక్ష్యాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవాలా లేదా అనే నిర్ణయం తీసుకునే ముందు అభ్యర్థులు తమ స్కోరు, గత సంవత్సరాల కటాఫ్ మార్కులు, తమ సన్నద్ధత స్థాయిని సమగ్రంగా విశ్లేషించాలి. కటాఫ్‌కు సమీపంలో స్కోరు సాధించిన వారు, నిజంగా వైద్య విద్యపై ఆసక్తి ఉన్నవారు మరోసారి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం లాంగ్‌టర్మ్ కోచింగ్ నిర్ణయం భావోద్వేగాలపై కాకుండా స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణ, గత తప్పులపై విశ్లేషణ ఆధారంగా ఉండాలి. టైమ్ మేనేజ్‌మెంట్, కాన్సెప్ట్‌లపై పట్టు, మాక్ టెస్టులు, క్రమబద్ధమైన రివిజన్‌పై దృష్టి పెడితే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీవీఎస్సీ వంటి ఇతర వైద్య కోర్సులను కూడా విద్యార్థులు పరిశీలించాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!