

విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి బాలీవుడ్ నటి ప్రీతి జింటా మద్దతు ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే ఉద్యమం ప్రధాన లక్ష్యమని, అది శాంతియుతంగా కొనసాగాలని ఆమె సూచించారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ప్రీతి జింటా, ఆన్‌లైన్‌లో పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజనాత్మక ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎలాంటి రాజకీయ లేదా అనుమానాస్పద ప్రయోజనాల కోసం వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పిన ఆమె, ప్రభుత్వం మరియు విద్యార్థి ప్రతినిధుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!