

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషల్ ఫాంటసీ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. సినిమా విడుదల తేదీపై మేకర్స్ నుంచి స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. చిరంజీవి మరో చిత్రం ‘కాకా’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో, ‘విశ్వంభర’ గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరినట్లు వార్తలు రావడంతో విడుదలపై మరోసారి చర్చ మొదలైంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ను ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దసరా సమయానికి విడుదలకు అవకాశం లేకపోవడంతో, నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సురభి, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీపై అధికారిక స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!