

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణలో పునరుద్ధరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను కూడా జలంధర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రవణీత్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు హాజరయ్యారు.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త స్టేషన్ భవనం, విశాలమైన వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, ఆధునిక సైనేజ్లతో అభివృద్ధి చేశారు. తెలంగాణలో రూ.40,000 కోట్లకు పైగా రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, సెల్ఫీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మరోవైపు హర్యానాలో జింద్–సోనిపత్ మార్గంలో దేశపు తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!