

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న పీరియడ్ క్రైమ్ డ్రామా '#కెజెక్యూ – కింగ్ జాకీ క్వీన్' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, నూతన నటి శశి ఓదెల హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఈ చిత్రానికి దర్శకుడు కేకే దర్శకత్వం వహించగా, గత ఏడాది ఆయన మరణించారు. ఆయన కలను సాకారం చేస్తూ చిత్ర బృందం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో ముగ్గురు ప్రధాన పాత్రలను స్ప్లిట్ ఫ్రేమ్‌లో చూపిస్తూ సినిమా మూడ్‌ను ప్రతిబింబించారు. నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!