

విదర్భ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు పసుపు హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!