

జాతీయ ప్రజా ఆర్థిక, విధాన సంస్థ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. ఒకవైపు భారీ రుణభారం ఉండగా, మరోవైపు సంక్షేమ పథకాల హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ప్రధాన సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది. అభివృద్ధి లక్ష్యాలతో కూడిన మూలధన పెట్టుబడులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొంది.
నివేదిక ప్రకారం 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 4.68 శాతంగా అంచనా వేయబడింది. ఇది ఆర్థిక సంఘం సూచించిన 3 శాతం పరిమితిని మించిపోయింది. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6గా నమోదైంది. జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, రాయితీలకు సంబంధించిన వ్యయం మొత్తం ఖర్చులో 86 శాతం ఉండటంతో మూలధన పెట్టుబడులకు అవకాశాలు తగ్గుతున్నాయని నివేదిక పేర్కొంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తులనాత్మకంగా మెరుగ్గా ఉందని కూడా వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!