
జనరల్

నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ బారాషహీద్ దర్గాలో రేపటి నుంచి ఆధ్యాత్మిక వైభవంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షించే ఈ ఉత్సవానికి ఈసారి 15 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో నెల్లూరుకు చేరుకుంటున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్గా ప్రాంగణం మరియు స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలతో పాటు భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. భద్రతా పరంగా పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!