
సినిమాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు లాభపడి 78,542 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 24,583 వద్ద ముగిసింది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివర్లో స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి పరిణామాల నేపథ్యంలో ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి, అమెరికా వడ్డీ రేట్లపై తగ్గిన ఆందోళనలు దేశీయ మార్కెట్లకు కొంత మద్దతుగా నిలిచాయి. నిఫ్టీకి 24,350 వద్ద బలమైన మద్దతు, 25,000 వద్ద నిరోధం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!