
గాసిప్స్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిట్ కౌంటర్ దాఖలు చేస్తూ, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) నిబంధనలు, మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోందని, ప్రత్యేక జ్యుడీషియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌తో పాటు విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీసీటీవీ పర్యవేక్షణ కమిటీ నివేదికలు ఇవ్వాలని విజయలక్ష్మి కోరగా, కేసుతో సంబంధంలేని సీసీటీవీ వివరాలను కోరడం సరికాదని సిట్ వాదించింది. అలాగే సిట్ సేకరించిన సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో భద్రపరచాలని విజయలక్ష్మి తరపు న్యాయవాది కోరారు. లేకపోతే భవిష్యత్తులో సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!