
సినిమాలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తికాకముందే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాజమౌళి తర్వాతి చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీతో రాజమౌళి ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఈ కాంబినేషన్ భారతీయ సినీ చరిత్రలో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!