
జనరల్

కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు వేతన సవరణతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఆర్పీ) అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాజమాన్యాన్ని ఆదేశించారు. హైదరాబాద్లో సింగరేణి సీఎండీ బుద్ధా ప్రకాశ్ జ్యోతి, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి తన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు.
రాబోయే రోజుల్లో సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధనలో ఆయన చేసిన కృషికి అభినందనలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!