
జనరల్

స్టీల్ ప్లాంట్లో గంటల వ్యవధిలో జరిగిన రెండు ప్రమాదాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. మొదట ఎస్ఎంఎస్-2 విభాగంలో ప్రమాదం సంభవించగా, అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో విభాగమైన ఎస్ఎంఎస్-1లో భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి విషమంగా మారింది.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితులను వెంటనే విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!