
జనరల్

పన్ను చెల్లింపుదారుల డబ్బును రుణాలుగా ఉదారంగా విడుదల చేస్తున్న బ్యాంకులు, వాటి వసూళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు (ఏఆర్‌సీలు), రుణగ్రహీతల మధ్య లాలూచీ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహన ధర్మాసనం వ్యక్తం చేసింది.
రూ.1,537 కోట్ల బకాయిలను కేవలం రూ.73.50 కోట్లకే సెటిల్ చేసిన ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం, ఆర్బీఐ సహా సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఏఆర్‌సీల పనితీరుపై సమగ్ర సమీక్ష అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!