

నౌహీరా షేక్‌కు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేలం వేసి విక్రయించిన తర్వాత, వాటిని కొనుగోలుదారుల పేరిట రిజిస్టర్ చేయించే బాధ్యతను తెలంగాణ హైకోర్టు ప్రొటోకాల్ రిజిస్ట్రార్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడిదారులను మోసం చేసి సంపాదించిన ఆస్తులను వేలం వేసి బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించాలని ఇప్పటికే కోర్టు పేర్కొంది. అయితే 45 ఆస్తులను వేలం వేసినా, వాటి రిజిస్ట్రేషన్‌కు నౌహీరా షేక్ సహకరించడం లేదని వెల్లడైంది.
జస్టిస్‌లు జె.బి. పార్దీవాలా, వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ బాధ్యతను ప్రొటోకాల్ రిజిస్ట్రార్ టి. వెంకటేశ్వరరావుకు అప్పగించింది. నిందితురాలి తరఫున ఆయన ఉప రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి కొనుగోలుదారుల పేర్లపై ఆస్తులను రిజిస్టర్ చేస్తారని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి సహకారం అందించాలని కోర్టు ఆదేశించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!