

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమై ప్రశ్నోత్తరాలతో కొనసాగనున్నాయి. అసెంబ్లీలో మంత్రి సీతక్క పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మరోసారి డిమాండ్ చేయనుంది. దీనికి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు నిన్న చేసిన ప్రయత్నాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నేడు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు. 22ఏ జాబితా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని బీజేపీ డిమాండ్ చేయనుంది. శాసన మండలిలో ఎరువుల కొరత, గ్రేటర్ హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులు మండలిలో ఆందోళనకు దిగే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!