

హీరో సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్‌కు తాజాగా యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. విడుదలకు ముందు విడుదలవుతున్న ప్రచార చిత్రాలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పురాతన మహేంద్రగిరి ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
వారాహి అమ్మవారికి సంబంధించిన ఓ రహస్యమైన శాపం కథలో కీలకంగా ఉండనుంది. ఓ రాజవంశానికి చెందిన పురుష వారసులు 33 ఏళ్ల వయసులోనే మరణిస్తుండటం, ఈ విషాదం 150 ఏళ్లుగా కొనసాగుతుండటం కథపై ఆసక్తిని పెంచుతోంది. ఈ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని దానికి ముగింపు పలికేందుకు సుమంత్ పాత్ర చేసే పోరాటం చుట్టూనే కథ సాగనున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో నటించగా, సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!