

బిగ్‌బాస్ 10 తెలుగు రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించి, ఒక్కో టీమ్‌కు నాయకులను ఎంపిక చేశారు. సెలబ్రిటీ టీమ్ నుంచి రాం ప్రసాద్‌ను, సామాన్యుల టీమ్ నుంచి రోహిత్‌ను నాయకులుగా ఎన్నుకున్నారు. అనంతరం బ్యాడ్జ్‌ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకునే టాస్క్ నిర్వహించారు. ఈ ప్రక్రియలోనే ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చలు, విభేదాలు మొదలయ్యాయి.
అయితే ఇంటి సభ్యుల చర్చలో రోహిత్ యాటిట్యూడ్‌పై యాంకర్ వర్షిణి తీవ్ర విమర్శలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్ ఆటతీరును చూసి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడిందని, తనతో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత రోహిత్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తానే అందరికంటే గొప్ప అన్నట్టుగా, తనకు సాటి ఎవరూ లేరన్నట్టుగా అతను వ్యవహరిస్తున్నాడని విమర్శించింది. ఒక టాస్క్‌లో ఓడిపోయినప్పటికీ తన తప్పును అంగీకరించకుండా ఎదుటివారినే నిందించాడని ఆరోపించింది.
అగ్నిపరీక్షలో రోహిత్‌కు పదేపదే ప్రశంసలు, ప్రాధాన్యత లభించడం వల్లే అతనిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఉండొచ్చని వర్షిణి అభిప్రాయపడింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేలోపే అతనిలో ఆత్మవిశ్వాసం హద్దులు దాటిందని, ఇక రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. మరోవైపు ఇంటి సభ్యులు గ్రూపులుగా ఆడుతున్నారన్న అంశంపైనా చర్చ జరిగింది. ఆర్జే చరణ్, వర్షిణి మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఝాన్సీ మాత్రం తటస్థంగా ఉంటూ అందరి గేమ్‌ను గమనిస్తోందని త్రిగుణ్ చెప్పాడు. ఇదిలా ఉండగా, శాలిని ప్రతి విషయాన్నీ గొడవగా మార్చుకుంటోందని, తనే గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తోందని దేబ్జానీ విమర్శించింది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో రెండో రోజుకే విభేదాలు మరింత ముదిరే సంకేతాలు కనిపించాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!