
సినిమాలు

జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరులో కలిశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు, వర్షాభావ పరిస్థితులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడేందుకు నీటి విడుదల అవసరమని కోరారు.
పాలమూరు ప్రాంతంలోని పంటలను కాపాడటంతో పాటు తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సానుకూలంగా స్పందించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి రైతుల కోసం నీటిని విడుదల చేసే ప్రక్రియను తెలంగాణ అధికారులు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!