

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలు పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల విడుదలైన, త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాలకు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ వంటి చిత్రాల టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలకు సూచించింది. ఆ మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్’, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత చిత్రాల నిర్మాతలు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!