

భారత నావికుల మృతిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. ఒమాన్ గల్ఫ్‌లోని ఎం.టి. సెట్టెబెల్లో చమురు నౌకపై జరిగిన క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అమెరికా విడుదల చేసిన ప్రకటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి లేదా సంతాపం తెలియజేయకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
వాణిజ్య నౌకను నిలిపివేయడానికి ప్రాణాంతక దాడికి బదులుగా ఇతర మార్గాలు ఉపయోగించవచ్చుకదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆదిత్య శర్మ, శివానంద్ చౌరాసియా, పట్నాల సురేష్ మృతి చెందగా, 21 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. అమెరికా స్పందన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్న ఆయన, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జరిగిన చర్చలో భారత ఆందోళనలను బలంగా వ్యక్తం చేసి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!