
జనరల్

భూములను త్వరగా ఇస్తే రాజధాని అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి చట్టబద్ధత రావడంతో ఇకపై ఎప్పటికీ మారదని ఆయన స్పష్టం చేశారు. హరిశ్చంద్రపురం, వడ్డమాను గ్రామసభల్లో పాల్గొన్న మంత్రి ల్యాండ్ పూలింగ్‌పై రైతుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములను ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేపడుతోందని ఆయన తెలిపారు. రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!