
జనరల్

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ–మోతీనగర్ ప్రాంతంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని ఎర్రగడ్డలోని జయంత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఉదయ్ కృష్ణా రెడ్డిపై ఇటీవల ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారి వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!