
జనరల్

ఇరాన్‌పై అమెరికా దాడులు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగుతున్నట్లు సమాచారం. పోర్టు నగరాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా బాంబు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు ధ్వంసమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ వెల్లడించింది. చాబహరా, బందర్ అబ్బాస్ నగరాల్లో బాంబులు పడ్డాయని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!