
జనరల్

ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల ఓటు వేయడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. మంగళవారం పద్మారావు నగర్‌లోని తన నివాసంలో జరిగిన ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా ఆయన తన వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని తమ పేరు ఓటరు జాబితాలో సరిగా ఉన్నదీ లేదీ పరిశీలించుకోవాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బీఎల్ఓ ప్రదీప్ పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!