
జనరల్

దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వర్షపు ప్రతి నీటి బొట్టును సంరక్షించి భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో ముందుండి ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక పంట కుంట, ప్రతి గ్రామానికి ఒక ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!