

ఈ ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తొలి విడతలో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లతో కలిపి మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. గురువారం నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లు, అదనంగా 7,632 ఈడబ్ల్యూఎస్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కన్వీనర్, ఈడబ్ల్యూఎస్, యాజమాన్య కోటాలను కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 1,21,639 బీటెక్ సీట్లు ఉన్నాయి. ఎప్సెట్ టాప్-100 ర్యాంకర్లలో కేవలం ఐదుగురు మాత్రమే రాష్ట్ర కౌన్సెలింగ్కు స్లాట్ బుక్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 30 శాతం యాజమాన్య కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులు, అనంతరం ఎప్సెట్ ర్యాంకులు, చివరగా ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!