
సినిమాలు

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!