

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో దర్శకుడిగా శివ నిర్వాణ క్రేజ్ మరింత పెరిగిందనే చర్చ జరుగుతోంది. కథను నడిపించిన తీరు, భావోద్వేగ సన్నివేశాలు, సంభాషణలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శివ నిర్వాణ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్‌కు శివ నిర్వాణ భావోద్వేగ కథనం జోడైతే కొత్త తరహా కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మెగాస్టార్‌ను కొత్త కోణంలో చూపిస్తే ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకంగా నిలిచే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. అయితే చిరంజీవి, శివ నిర్వాణ కలయికపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇది అభిమానుల ఊహాగానాలకే పరిమితమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!